కైకలూరు మాజీ ఎమ్మెల్యే మృతి
కైకలూరు మాజీ ఎమ్మెల్యే ఎర్నేని రాజారామ్ చందర్ (రాజబాబు) మృతి చెందారు.
కైకలూరు మాజీ ఎమ్మెల్యే ఎర్నేని రాజారామ్ చందర్ (రాజబాబు) మృతి చెందారు. గతకొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న రాజబాబు ఆదివారం సాయంత్రం 6 గంటలకు తన స్వగ్రామమైన కలిదిండి మండలం కొండూరు గ్రామంలో మృతి చెందారు. కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలలో రాజబాబు విశేష సేవలందించారు. కైకలూరు నుండి మూడు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అందులో ఒకసారి టీడీపీ తరపున, ఇండిపెండెంట్ గా ఒకసారి, కాంగ్రెస్ తరపున ఓసారి ఎన్నికయ్యారు. టీడీపీ అవిర్భావం తర్వాత కాంగ్రెస్ ను వీడిన రాజబాబు 1992లో జరిగిన ఉప ఎన్నికలో తెలుగుదేశం పార్టీ తరపున గెలిచారు..
ఆ తరువాత 1994లో టీడీపీ తరపున పోటీ చేసి ఓటమిచెందారు. అయితే 1999లో టీడీపీ టిక్కెట్ ఇవ్వకపోవటంతో ఇండిపెండెంట్ గా పోటీ చేసి గెలిచారు. ఇండిపెండెంట్ గా గెలిచిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరారు. నాటి నుండి నేటి వరకు కాంగ్రెస్ లోనే కొనసాగిసుతున్నారు. 2004లో కాంగ్రెస్ తరపున ఓటమి చెందారు.. అయితే 2009లో మాత్రం కాంగ్రెస్ తరపున విజయం సాధించారు. రాజబాబు మృతిపట్ల పలువురు కాంగ్రెస్ నేతలు, వివిధ పార్టీలకు చెందిన నాయకులు సంతాపం తెలిపారు.