Jogi Ramesh: మరణాలన్నీ చంద్రబాబు చేసిన హత్యలే..సేవ ముసుగులో..

Jogi Ramesh: చంద్రబాబుపై డీజీపీకి ఫిర్యాదు చేస్తా

Update: 2023-01-02 06:56 GMT

Jogi Ramesh: చంద్రబాబును గెలిపించడం కోసం కొన్ని శక్తులు.. సేవ ముసుగులో పేదల మృతికి కారణమవుతున్నాయి

Jogi Ramesh: చంద్రబాబును గెలిపించడం కోసం కొన్ని శక్తులు సేవ ముసుగులో పేదల మరణాలకు కారణమతున్నాయని మంత్రి జోగి రమేష్ ఆరోపించారు. కానుకలు, సభల పేరుతో ప్రజలను సమీకరించి పేదల ఉసురు తీస్తున్నారని విమర్శించారు. చంద్రబాబు పేద ప్రజల ఉసురు తీస్తున్నాడు. నాలుగు రోజుల క్రితమే 8 మందిని బలితీసుకున్నాడు. మరోసారి సభ పేరుతో ముగ్గురిని పొట్టనపెట్టుకున్నాడు. ఈ మరణాలన్నీ చంద్రబాబు చేస్తున్న హత్యలే. చంద్రబాబును వెంటనే అరెస్ట్ చేయాలి. చంద్రబాబు మీటింగ్‌లకు ఎక్కడా పర్మిషన్లు ఇవ్వొద్దని డీజీపీని కోరుతున్నాను. చంద్రబాబుని రాష్ట్రంలో తిరగనిస్తే మరింత మంది ప్రజల ప్రాణాలను బలితీసుకుంటాడు అంటూ జోగి రమేష్ కామెంట్స్‌ చేశారు.

Tags:    

Similar News