JC Prabhakar Reddy: నీ విగ్రహాల ఏర్పాటు నిరాకరించే వారికి నిద్ర లేకుండా చేయ్యి స్వామి..!
JC Prabhakar Reddy: వినాయక చవితి వేడుకలకు ప్రభుత్వం నిబంధనలు విధించడంపై టీడీపీ సీనియర్ నేత, తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి మండిపడ్డారు.
JC Prabhakar Reddy: నీ విగ్రహాల ఏర్పాటు నిరాకరించే వారికి నిద్ర లేకుండా చేయ్యి స్వామి..!
JC Prabhakar Reddy: వినాయక చవితి వేడుకలకు ప్రభుత్వం నిబంధనలు విధించడంపై టీడీపీ సీనియర్ నేత, తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి మండిపడ్డారు. ప్రభుత్వ దయాదాక్షిణ్యాలపై ఆధారపడి హిందువులు పండుగలు జరుపుకోవాలా అని ప్రశ్నించారు. శాంతి భద్రతల పేరుతో వినాయక విగ్రహాల ఏర్పాటుకు అనుమతి నిరాకరించడం సరికాదన్నారు. గణేష్ విగ్రహాల ఏర్పాటు అనుమతుల కోసం గంటల తరబడి నిరీక్షణ ఎందుకు? అని ప్రశ్నించారు జేసీ ప్రభాకర్ రెడ్డి.
విగ్రహాల అనుమతి నిరాకరణతో వారి పతనం మొదలైందని శాపనార్థాలు పెట్టిన ఆయన శాంతి భద్రతల పేరుతో విగ్రహాల ఏర్పాటు అనుమతి నిరాకరణ సరికాదని హితవు పలికారు. మున్సిపల్ చైర్మన్ అయిన నాకే అనుమతి కోసం అధికారులు చుట్టూ తిరిగే పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. వినాయక విగ్రహాల ఏర్పాటు నిరాకరించే వారికి నిద్ర లేకుండా చేయ్యాలని గణనాధుడిని వేడుకున్నట్లు జేసీ ప్రభాకర్ రెడ్డి చెప్పారు.