JC Prabhakar Reddy: జేసీ ప్రభాకర్‌రెడ్డి హౌస్ అరెస్ట్
JC Prabhakar Reddy: జేసీ ప్రభాకర్ ఇంటి దగ్గర భారీగా పోలీసుల మోహరింపు
JC Prabhakar Reddy: జేసీ ప్రభాకర్‌రెడ్డి హౌస్ అరెస్ట్
JC Prabhakar Reddy: అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. జేసీ ప్రభాకర్‌రెడ్డిని హౌస్ అరెస్ట్ చేశారు పోలీసులు. ఇవాళ తాడిపత్రిలో పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో చైర్మన్ హోదాలో పాల్గొనాలని జేసీ ప్రభాకర్‌రెడ్డికి మున్సిపల్ అధికారులు ఆహ్వానం పంపారు. అయితే ఇదే కార్యక్రమానికి ఎమ్మెల్యే పెద్దారెడ్డి కూడా హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో శాంతిభద్రతల దృష్ట్యా పెన్షన్ల పంపిణీ కార్యక్రమానికి జేసీ రాకూడదని పోలీసులు ఆంక్షలు విధించారు. జేసీ ప్రభాకర్ ఇంటి దగ్గర భారీగా పోలీసులు మోహరించారు. నలుగురు సీఐల ఆధ్వర్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.