ప్రకాశం జిల్లా ఎస్పీని కలిసిన పవన్ కళ్యాణ్.. వైసీపీ ఎమ్మెల్యేపై ఎస్పీకి ఫిర్యాదు..
ప్రకాశం జిల్లా ఎస్పీని కలిసిన పవన్ కళ్యాణ్.. వైసీపీ ఎమ్మెల్యేపై ఎస్పీకి ఫిర్యాదు..
ప్రకాశం జిల్లాలో ఆత్మహత్య చేసుకున్న జనసేన కార్యకర్త వెంగయ్య కుటుంబ సభ్యులతో కలిసి ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్‌ను కలిశారు పవన్‌కల్యాణ్. వెంగయ్యనాయుడు ఆత్మహత్య చేసుకోవడానికి.. గిద్దలూరు ఎమ్మెల్యే అన్నా రాంబాబు కారణమంటూ ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేయాలని ఎస్పీని కోరారు పవన్‌కల్యాణ్. అంతకముందు ఒంగోలులో జనసేన కార్యకర్త వెంగయ్య నాయుడు కుటుంబాన్ని పరామర్శించారు. వెంగయ్య చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. వెంగయ్య కుటుంబానికి జనసేన తరపున రూ.8లక్షల50వేలు ఆర్ధిక సాయాన్ని పవన్ అందించారు. వెంగయ్య నాయుడు పిల్లల చదువులు పూర్తయ్యే వరకూ అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఈ నెల 18న బేస్తవారిపేట మండలం సింగరపల్లిలో వెంగయ్య ఆత్మహత్యకు పాల్పడ్డారు. గిద్దలూరు ఎమ్మెల్యే అన్నా రాంబాబు బెదిరింపుల వల్ల వెంగయ్య ఆత్మహత్య చేసుకున్నాడని ఆరోపణలు వచ్చాయి. దీంతో జనసేనాని పరామర్శించారు.