Nara Brahmani: నారా బ్రాహ్మణితో సమావేశమైన జనసేన నేతలు
Nara Brahmani: చంద్రబాబు తప్పు చేసినట్లు చిన్న ఆధారం కూడా లేదు
Nara Brahmani: నారా బ్రాహ్మణితో సమావేశమైన జనసేన నేతలు
Nara Brahmani: ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు చెందిన జనసేన నాయకులు, పలు నియోజవర్గాల ఇంచార్జ్‌లు.. నారా బ్రాహ్మణిని కలిశారు. చంద్రబాబు అరెస్టు ముమ్మాటికీ కక్ష సాధింపు చర్యేనన్నారు. రాష్ట్రంలో ఇలాంటి పరిస్థితులు ఎన్నడూ, ఎవరూ చూడలేదన్నారు నారా బ్రాహ్మణి. చంద్రబాబుపై కేసు విషయంలో అన్ని డాక్యుమెంట్లు, రిపోర్టులు తాను పరిశీలించానని....చంద్రబాబు తప్పు చేసినట్లు చిన్న ఆధారం కూడా ఎక్కడా లేదని అన్నారు నారా బ్రాహ్మణి. రాజకీయ కక్ష తప్ప ఈ కేసు మరొకటి కాదని అభిప్రాయపడ్డారు. ఈ స్థాయి విధ్వేష రాజకీయాలు ఎప్పుడూ లేవని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్య పరిరక్షణకు రెండు పార్టీలు అన్నదమ్ముల్లా కలిసి పోరాడాలన్నారు బ్రాహ్మణి.