YS Jagan: జగన్ తిరుమల పర్యటన రద్దు
YS Jagan Tirumala Visit Cancelled: కాసేపట్లో మీడియా ముందుకు జగన్
జగన్ తిరుమల పర్యటన రద్దు
YS Jagan Mohan Reddy: మాజీ సీఎం జగన్ తిరుమల పర్యటన రద్దు అయింది. ఈ మేరకు వైసీపీ అధికారిక ప్రకటన విడుదల చేసింది. తిరుమల లడ్డూ వివాదం నేపథ్యంలో తిరుమల పర్యటనకు జగన్ వెళ్లేందుకు నిర్ణయం తీసుకున్నారు. అయితే జగన్ తిరుమల పర్యటనపై కొద్దిరోజులుగా వివాదం నడుస్తోంది. జగన్ తిరుమల వెళ్లాలంటే డిక్లరేషన్ చేయాలని డిమాండ్లు వినిపించాయి. అయితే ఈ వివాదం కొనసాగుతున్న వేళ జగన్ తిరుమల పర్యటన రద్దు చేసుకున్నారు. మరోవైపు కాసేపటి క్రితమే జగన్‌ను ఉద్దేశిస్తూ సీఎం చంద్రబాబు ట్వీట్ చేశారు.
ఆలయ నియమాలు, నిబంధనలు తప్పక పాటించాలన్నారు. శ్రీవారి సన్నిధికి వెళ్లే ప్రతీ ఒక్కరూ ఆగమ శాస్త్ర, ఆలయ నిబంధనలు పాటించాలని సూచించారు. భక్తుల మనోభావాలు, ఆలయ ఆచారాలు దెబ్బతీసేలా ఎవరూ వ్యవహరించొద్దని తెలిపారు. ప్రతీ భక్తుడు తిరుమల శ్రీవారిని భక్తి శ్రద్ధలతో కొలుస్తారన్న సీఎం చంద్రబాబు.. క్షేత్ర పవిత్రత కాపాడటం తమ ప్రభుత్వ ప్రాధాన్యత అని స్పష్టం చేశారు.