ఇవాళ జగనన్న విద్యా దీవెన నిధులు విడుదల
Jagan: 9.86లక్షల మంది విద్యార్థులకు రూ. 698.68కోట్లు జమ
ఇవాళ జగనన్న విద్యా దీవెన నిధులు విడుదల
Jagan: గత ఏడాది విద్యా సంవత్సరానికి సంబంధించిన జగన్న విద్యా దీవెన పథకం నిధులను సీఎం జగన్మోహన్ రెడ్డి ఇవాళ విడుదల చేయనున్నారు. రాష్ట్రంలోని 9లక్షల 86వేల మంది విద్యార్ధులకు 698కోట్ల 68 లక్షలను సీఎం వైఎస్ జగన్ నేడు ఎన్‌టీఆర్ జిల్లా తిరువూరులో బటన్ నొక్కి నేరుగా విద్యార్ధుల తల్లుల ఖాతాల్లో జమ చేయనున్నన్నారు.
పేద విద్యార్ధులు ఉన్నత చదువులు అభ్యసించేందుకు వైఎస్ జగన్ ప్రభుత్వం అందిస్తున్న జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన పథకాలకు లిమిట్స్ లేకుండా అందజేస్తుంది. కుటుంబంలో ఎంతమంది చదువుతుంటే అంతమంది చదివెలా కార్యక్రమాన్ని ప్రభుత్వం అమలు చేస్తుంది. పేద విద్యార్ధులు కూడా పెద్ద చదువులు చదవాలన్న సమున్నత లక్ష్యంతో ఐటీఐ, పాలిటెక్నిక్, డిగ్రీ, ఇంజినీరింగ్, మెడిసిన్ తదితర కోర్సులు చదివే పేద విద్యార్ధులు కాలేజీలకు చెల్లించాల్సిన పూర్తి ఫీజుల మొత్తాన్ని క్రమం తప్పకుండా విద్యార్ధుల తల్లుల ఖాతాల్లో నేరుగా జమ చేస్తున్న వైఎస్ జగన్ సర్కార్ పెండింగ్ లేకుండా నిధులు మంజూరు చేస్తుంది.
ఇంకా ఉన్నత చదువులు చదివే పేద విద్యార్ధులు భోజన, వసతి ఖర్చుల కోసం ఇబ్బంది పడకుండా ఏటా రెండు వాయిదాలలో ఐటీఐ విద్యార్ధులకు 10 వేలు, పాలిటెక్నిక్ విద్యార్ధులకు 15 వేలు, డిగ్రీ, ఇంజినీరింగ్, మెడిసిన్ తదితర కోర్సులు అభ్యసించేవారికి 20 వేల చొప్పున ఆర్ధిక సాయం. కుటుంబంలో ఎంతమంది చదువుతుంటే అంతమందికి, వారి తల్లుల ఖాతాల్లో సంవత్సరానికి రెండు దఫాల్లో నేరుగా జమ చేస్తున్న విద్యార్థులు ఎవ్వరూ ఆర్థిక ఇబ్బందులు పడకుండా తమ చదువులు కొనసాగేలా అడుగులు వేస్తుంది.