Jagan: ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వండి.. ప్రధాని మోడీకి సీఎం జగన్ వినతిపత్రం..!
Special Status For AP: గన్నవరం ఎయిర్‌పోర్టులో ప్రధాని మోడీకి సీఎం జగన్ వీడ్కోలు పలికారు.
Jagan: ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వండి.. ప్రధాని మోడీకి సీఎం జగన్ వినతిపత్రం..!
Special Status For AP: గన్నవరం ఎయిర్‌పోర్టులో ప్రధాని మోడీకి సీఎం జగన్ వీడ్కోలు పలికారు. ఇక ఇదే సమయంలో ప్రధాని మోడీకి వినతిపత్రం అందజేశారు జగన్. ఏపీకి ప్రత్యేకహోదా ఇవ్వాలని లేఖలో కోరారు. అలాగే పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి సవరించిన నిధులకు ఆమోదం తెలపాలని విజ్ఞప్తి చేశారు. భోగాపురం ఎయిర్‌పోర్టుకు క్లియరెన్స్‌లు మంజూరు చేయాలని లేఖలో విన్నవించారు. రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటైన వైద్య కళాశాలలకు ఆర్థికసాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. రీసోర్స్ గ్యాప్ గ్రాంటుగా 34 వేల 125 కోట్లు ఇవ్వాలని లేఖలో కోరారు. తెలంగాణ డిస్కంల నుంచి ఏపీకి రావాల్సిన 6 వేల 6వందల 27 కోట్లు ఇప్పించాలని లేఖలో కోరారు సీఎం జగన్.