YS Jagan: ఏపీ సీఎం చంద్రబాబుకు జగన్ ట్వీట్.. పేదల ఇళ్ల స్థలాలు రద్దు చేసే అధికారం ఎవరు ఇచ్చారు..?

YS Jagan: ఏపీ సీఎం చంద్రబాబుకు వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ ఎక్స్ వేదికగా పలు ప్రశ్నలు సంధించారు.

Update: 2025-09-18 10:37 GMT

YS Jagan: ఏపీ సీఎం చంద్రబాబుకు వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ ఎక్స్ వేదికగా పలు ప్రశ్నలు సంధించారు. అధికారం ఇచ్చింది పేదలపై కత్తి కట్టడానికా.. వారి సొంతింటి కలలను నాశనం చేయడానికా అని ప్రశ్నించారు. పేదలకు అందుతున్న పథకాలు రద్దుచేసే ప్రభుత్వం అని మరోసారి నిరూపణ అయ్యిందన్నారు. వైసీపీ హాయంలో రిజిస్ట్రేషన్ చేసిన ఇళ్ల స్థలాలను వెనక్కి తీసుకున్న ప్రభుత్వ నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.

వైసీపీ హయంలో ఇంటి నిర్మాణానికి లబ్ధిదారులకు సిమెంటు, స్టీలు, వంటి నిర్మాణానికి అవసరమైన దాదాపు 12 రకాల సామాన్లు తక్కువ ధరకే అందించామని.. ప్రతీ లబ్ధిదారుడికి 40 వేల రూపాయలు మేలు జరిగిందన్నారు. ఉచితంగా 20 టన్నుల ఇసుకను ఉచితంగా అందించామన్నారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత లబ్దిదారులకు ఏమి ఇచ్చారని ప్రశ్నించారు.

పేదలకు ఇళ్లు మంజూరు చేయించి కట్టించాల్సింది పోయి.. ప్రైవేట్ ఇండస్ట్రియల్ పార్కులు కడుతాం అంటూ ప్రకటనలు ఇవ్వడం సిగ్గు చేటన్నారు. పేదలకు మద్దతుగా న్యాయపోరాటం చేస్తామని.. ఆందోళనకు సిద్ధం కావాలని పార్టీ శ్రేణులకు జగన్ పిలుపునిచ్చారు.

  

Tags:    

Similar News