CM Jagan: పేదలకు ఆరోగ్యశ్రీ పథకం ఓ వరం

CM Jagan: 4 కోట్ల 25 లక్షల మంది ఆరోగ్యశ్రీ కిందకు వస్తారు

Update: 2023-12-18 07:36 GMT

CM Jagan: పేదలకు ఆరోగ్యశ్రీ పథకం ఓ వరం

CM Jagan: వైఎస్‌ఆర్ ఆరోగ్యశ్రీపై అవగాహన కార్యక్రమాన్ని సీఎం జగన్ ప్రారంభించారు. వైఎస్సార్ ఆరోగ్యశ్రీపై అవగాహన కార్యక్రమాన్ని తాడేపల్లిలోని తన క్యాంప్‌ కార్యాలయంలో సీఎం ప్రారంభించారు. ఆరోగ్యశ్రీ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేయించడం...అలాగే ఈ పథకం ద్వారా వైద్యం ఎలా పొందాలనే దానిపై అర్హులకు అవగాహన కల్పించడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం అన్నారు.

దీంతో పాటు కొత్త ఫీచర్లతో మెరుగైన ఆరోగ్యశ్రీ కార్డుల పంపిణీ... ఆరోగ్యశ్రీ ద్వారా అందించే వైద్యం పరిధి 25 లక్షల దాకా పెంపును సీఎం జగన్ ప్రారంభించారు. నేటి నుంచి కొత్త ఫీచర్లతో స్మార్ట్ ఆరోగ్యశ్రీకార్డులు అందించనున్నారు. లబ్ధిదారుల ఫొటో, ఎలక్ట్రానిక్ హెల్త్‌ రికార్డులో పొందుపర్చిన ఆరోగ్య వివరాలతో ABHA ఐడీలను ప్రభుత్వం అందించనుంది. 4.52 కోట్ల మంది లబ్ధిదారులకు ఆరోగ్యశ్రీ సేవలపై అవగాహన కల్పించనున్నారు.

Tags:    

Similar News