Jagan: సిట్టింగ్‌లకు ఫిట్టింగ్.. వరుసగా ఎమ్మెల్యేలను మారుస్తూ షాకిస్తున్న జగన్

Jagan: ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ముగ్గురికి నో టికెట్

Update: 2023-12-15 09:41 GMT

Jagan: సిట్టింగ్‌లకు ఫిట్టింగ్.. వరుసగా ఎమ్మెల్యేలను మారుస్తూ షాకిస్తున్న జగన్

Jagan: ఏపీలో సిట్టింగ్ ఎమ్మెల్యేలకు వరుస షాకులు తగులుతున్నాయి. వరుసగా ఎమ్మెల్యేలను మారుస్తూ షాకిస్తున్నారు పార్టీ అధినేత జగన్. ఇప్పటికే మార్పులు ఉంటాయని సమాచారం ఇవ్వగా.. తాజాగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ముగ్గురిని మారుస్తూ నిర్ణయం తీసుకుంది అధిష్టానం. జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు.. పత్తిపాడు ఎమ్మెల్యే పర్వత ప్రసాద్, పిఠాపురం ఎమ్మెల్యే పెండం దొరబాబుకు రాబోయే ఎన్నికల్లో టికెట్లు ఇవ్వబోమని తేల్చిచెప్పింది. మూడు స్థానాల్లో కొత్త వారికే ఛాన్స్ ఇస్తున్నట్టు స్పష్టం చేసింది.

ఇక సిట్టింగులు మార్చిన మూడు నియోజకవర్గాల్లో ఇంఛార్జ్‌లను కూడా మారుస్తూ జగన్ నిర్ణయం తీసుకున్నారు. జగ్గంపేటకు కొత్త ఇంఛార్జ్‌గా తోట నరసింహంను నియమించారు. పత్తిపాడు ఇంఛార్జ్‌గా పర్వత జానకి దేవి.. పిఠాపురం ఇంఛార్జ్‌గా వంగా గీతను నియమించారు.

Tags:    

Similar News