CM Jagan: లక్ష్మీ మహాయజ్ఞానికి సీఎం జగన్‌కు ఆహ్వానం

CM Jagan: శ్రీశైలంలో మహా కుంభాభిషేకానికి కూడా సీఎం జగన్‌కు ఆహ్వానం

Update: 2023-05-09 09:31 GMT

CM Jagan: లక్ష్మీ మహాయజ్ఞానికి సీఎం జగన్‌కు ఆహ్వానం

CM Jagan: విజయవాడలో నిర్వహించనున్న లక్ష్మీ మహా యజ్ఞానికి డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ, దేవాదాయ శాఖ కమిషనర్‌ ఎస్.సత్యనారాయణ.. సీఎం జగన్‌ను ఆహ్వానించారు. క్యాంప్ ఆఫీస్‌లో సీఎంను పండితులతో సహా కలిసి ఆహ్వాన పత్రిక అందజేశారు. ఈనెల 12 నుంచి 17 వరకు విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో లక్ష్మీ మహా యజ్ఞం నిర్వహించనున్నారు.

ఇక శ్రీశైలంలో ఈనెల 25 నుంచి జరగనున్న మహా కుంభాభిషేక మహోత్సవానికి కూడా ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి, శ్రీశైల దేవస్థాన ఛైర్మన్‌ రెడ్డివారి చక్రపాణి రెడ్డి సీఎం జగన్‌ను ఆహ్వానించారు. అనంతరం వేద పండితులు సీఎం జగన్‌ ఆ‌శీర్వదించి తీర్థ ప్రసాదాలు అందజేశారు.

Tags:    

Similar News