సినీ ఫక్కీలో దారి దోపిడి చేస్తున్న అంతర్ రాష్ట్ర దొంగల ముఠా అరెస్ట్

నంద్యాల జాతీయ రహదారిపై అంతరాష్ట్ర కరుడు గట్టిన కంజారా గ్యాంగ్ నేరస్తులను నంద్యాల సబ్ డివిజన్ పోలీసులు గురువారం అరెస్టు చేశారు.

Update: 2019-11-28 10:58 GMT
నంద్యాల సబ్ డివిజన్ పోలీసులు మరియు నిందితులు

కర్నూలు: నంద్యాల జాతీయ రహదారిపై అంతరాష్ట్ర కరుడు గట్టిన కంజారా గ్యాంగ్ నేరస్తులను నంద్యాల సబ్ డివిజన్ పోలీసులు గురువారం అరెస్టు చేశారు. ఈ నెల నవంబర్ 4, 5 , 6 తారీఖుల్లో కర్నూలు నుండి నంద్యాల, ఆళ్ళగడ్డ రహాదారుల్లో వెళుతున్న డిటిసి వరల్డ్ ఫస్ట్ కోరియర్ కార్గో కంటైనర్ వాహానాన్ని రన్నింగ్ లోనే కరుడు గట్టిన నేరస్తులు చాకచక్యంగా కట్టర్ ల ద్వారా లాక్ ను కట్ చేసి కంటైనర్ లోకి ప్రవేశించి విలువైన సామాగ్రిని దొంగిలించారు.

ఈ సదరు సంఘటనలపై నంద్యాల తాలుకా, ఆళ్ళగడ్డ రూరల్ పోలీసు స్టేషన్ లలో కేసులు నమోదయ్యాయి. కేసు విచారణలో భాగంగా మధ్య ప్రదేశ్ నుండి వచ్చిన కంజారా గ్యాంగ్ దొంగతనాలకు పాల్పడుతున్నట్లు తెలిసింది. ఈ తరహా నేర విధానంలోనే నేరస్తుల నుండి చోరి కాబడిన వస్తువులలో నుండి 30 ఒప్పో సెల్ ఫోన్లు, 55 లావా సెల్ ఫోన్ లు , ఒక బాక్స్ మెడిసిన్ , 16 చీరలు స్వాధీనం చేసుకున్నారు. 



Tags:    

Similar News