Online Admission: ఇంటర్‌ విద్యార్ధులకు తలనొప్పిగా ఆన్‌లైన్‌ అడ్మిషన్‌ విధానం

Online Admission:ఇంటర్‌ మీడియట్‌ ఆడ్మిషన్లకు ప్రభుత్వం ఈ ఏడాది ఆన్‌లైన్‌ విధానం ప్రవేశపెట్టింది.

Update: 2021-08-21 03:12 GMT

Online Admission: ఇంటర్‌ విద్యార్ధులకు తలనొప్పిగా ఆన్‌లైన్‌ అడ్మిషన్‌ విధానం

Online Admission: ఇంటర్‌ మీడియట్‌ ఆడ్మిషన్లకు ప్రభుత్వం ఈ ఏడాది ఆన్‌లైన్‌ విధానం ప్రవేశపెట్టింది. ఈ విధానం విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు చుక్కలు చూపుతోంది. మరోవైపు కళాశాలల యాజమాన్యాలు నూతన నిబంధనలతో బెంబేలెత్తుతున్నాయి.

జూనియర్‌ కళాశాలల్లో ఆన్‌లైన్‌ అడ్మిషన్‌ కోసం ఈ నెల 20 నుంచి 26 వరకు ఇంటర్‌ బోర్డు అనుమతులు ఇచ్చింది. అయితే అడ్మిషన్లను గతంలో మాదిరిగా కాకుండా ఆన్‌లైన్‌లోనే చేసుకునేలా నిబంధన విధించింది. ఇందుకు సంబంధించి తొలి రోజు వెబ్‌సైట్‌ ఓపెన్‌ కాక అనేక కళాశాలల్లో అడ్మిషన్‌ ప్రక్రియ సక్రమంగా జరగలేదని విద్యార్థుల తల్లిదండ్రులు, యాజమాన్యాలు వాపోతున్నాయి.

ఆన్‌లైన్‌ అడ్మిషన్‌ ప్రక్రియలో భాగంగా తొలుత ఇంటర్‌ బోర్డు వెబ్‌సైట్‌లో రిజిస్ట్రేషన్‌ చేయించుకోవాలి. ఇందుకోసం విద్యార్థి రూ.100 ఫీజు చెల్లించాలి. తరువాత విద్యార్థి పదో తరగతి పరీక్షల సందర్భంగా రిజిస్టర్ చేసిన సెల్‌ నెంబర్‌కు ఓటీపీ వస్తుంది. అయితే పదో తరగతి పరీక్షల సమయంలో ఎవరి సెల్‌ నంబర్‌ ఇచ్చారో గుర్తుకురాక పలువురు విద్యార్ధులు ఇబ్బంది పడ్డారు. తల్లిదండ్రుల్లో ఎవరో ఒకరి ఫోన్‌ నెంబర్‌ ఇస్తే సరేసరి లేకుంటే విద్యార్థులకు ఓటీపీ రాక ఇబ్బంది పడుతున్నారు.

మరోపక్క మారుమూల గ్రామాలలో సెల్‌ఫోన్‌ సిగ్నల్ సరిగా అందక, ఇంటెర్నెట్‌ పనిచేయకపోవడంతో ఆన్‌లైన్ అడ్మిషన్‌ కష్టతరంగా మారింది. మరికొందరు విద్యార్ధులు గాని వారి తల్లిదండ్రులకు గాని ఆన్‌లైన్‌లో అడ్మిషన్‌ ఎలా తీసుకోవాలో తెలీక తికమక పడుతున్నారు.

ఆన్లైన్‌లో కాలేజీని సెలెక్ట్ చేసుకోవడం ఇబ్బందికరంగా మారింది. మారుమూల గ్రామాల్లో ఒకపక్క ఇంటర్నెట్‌ మొరాయిస్తుంది. సర్వర్లు పనిచేయడం లేదు. నమోదుకు గడువు చూస్తేనేమో అయిపోతుంది. ఈ విషయంలో ప్రభుత్వం పునరాలోచించి నిర్ణయం తీసుకోవాలని విద్యార్థులు వారి తల్లిదండ్రులు వేడుకుంటున్నారు.

Full View


Tags:    

Similar News