Andhra Pradesh: ఏపీలో ఇంటర్ పరీక్షలు వాయిదా
Andhra Pradesh: ఏపీలో ఇంటర్ పరీక్షలు వాయిదా పడ్డాయి. హైకోర్టు అభిప్రాయం పరిగణనలోకి తీసుకుని వాయిదా వేసినట్టు ప్రభుత్వం తెలిపింది.
Andhra Pradesh: ఏపీలో ఇంటర్ పరీక్షలు వాయిదా
Andhra Pradesh: ఏపీలో ఇంటర్ పరీక్షలు వాయిదా పడ్డాయి. హైకోర్టు అభిప్రాయం పరిగణనలోకి తీసుకుని వాయిదా వేసినట్టు ప్రభుత్వం తెలిపింది. పరిస్థితులు చక్కబడ్డాక ఇంటర్ పరీక్షల తేదీలను ప్రకటిస్తామని మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. మొదట కొవిడ్ నిబంధనల్ని పాటిస్తూ పరీక్ష కేంద్రాల్లో అన్ని నిబంధనలూ అమలు చేస్తూ ప్రత్యేక బృందాల పర్యవేక్షణలో ఇంటర్ పరీక్షలు నిర్వహించాలని భావించామని మంత్రి సురేష్ తెలిపారు. దేశంలో, రాష్ట్రంలో పెరుగుతున్న కొవిడ్ కేసులు పట్ల పరీక్ష రాయాల్సిన పిల్లలు, తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారన్న విషయాన్ని పరిగణనలోకి తీసుకుని వాయిదా వేస్తున్నట్టు మంత్రి స్పష్టం చేశారు.
ఇప్పటికే విద్యార్థుల ప్రాక్టికల్స్ పూర్తి అయ్యాయి. విద్యార్థుల ప్రాణాలు, వారి భవిష్యత్తు గురించి ఆలోచించి పరీక్షలు వాయిదా వేస్తున్నట్టు మంత్రి తెలిపారు. పరిస్థితులు చక్కబడిన వెంటనే ఇంటర్ పరీక్షల నిర్వహణకు ప్రభుత్వం కొత్త తేదీలు ప్రకటిస్తుందని స్పష్టం చేశారు. ఇదే విషయాన్ని సోమవారం హైకోర్టుకు తెలపనుంది ప్రభుత్వం.