Tirupati Laddu: శ్రీవారి లడ్డూలకు పెరిగిన డిమాండ్
Tirupati Laddu: అంచనాలు తప్పని నిరూపించిన శ్రీవారి భక్తులు
Tirupati Laddu: శ్రీవారి లడ్డూలకు పెరిగిన డిమాండ్
Tirupati Laddu: తిరుమల శ్రీవారి లడ్డూలకు భారీగా డిమాండ్ పెరిగింది. వివాదాల నేపథ్యంలో డిమాండ్ తగ్గుతుందని టీటీడీ అధికారులు భావించారు. అయితే అందరి అంచనాలు తప్పని నిరూపించారు శ్రీవారి భక్తులు. లడ్డూ విక్రయాలపై నెయ్యి వివాదం ఎఫెక్ట్ చూపలేదు. ఈనెల 19వ తేదీన 3.59 లక్షల లడ్డూలు విక్రయించింది టీటీడీ. ఇక ఈనెల 20న 3.16 లక్షల లడ్డూలు, 21న 3.66 లక్షల లడ్డూలను శ్రీవారి భక్తులు కొనుగోలు చేశారు.