Chandrababu: గత ప్రభుత్వ హయాంలో అందరూ బాధితులే
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శాసనసభలో మాట్లాడుతూ, గత ప్రభుత్వ హయాంలో రాష్ట్ర ప్రజలందరూ బాధితులేనని వ్యాఖ్యానించారు.
Chandrababu: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శాసనసభలో మాట్లాడుతూ, గత ప్రభుత్వ హయాంలో రాష్ట్ర ప్రజలందరూ బాధితులేనని వ్యాఖ్యానించారు. తన రాజకీయ జీవితంలో గతంలో తనపై ఎప్పుడూ ఎవరూ కేసులు పెట్టలేదని సీఎం చంద్రబాబు గుర్తు చేశారు. "నేను ఎలాంటి తప్పూ చేయను కాబట్టే, నాపై కేసులు పెట్టేందుకు వారు భయపడతారు" అని ఆయన స్పష్టం చేశారు.
తాను ఎప్పుడూ తప్పు చేయనని, ఒకవేళ ఎవరైనా తప్పులు చేస్తే మాత్రం వారి గుండెల్లో రైళ్లు పరుగెత్తిస్తానని హెచ్చరించారు. వైకాపా ప్రభుత్వ హయాంలో మాత్రం తనపై 17 కేసులు పెట్టినట్లు ఆయన ప్రస్తావించారు. తాను బాధ్యత గల నాయకుడిని కాబట్టే ప్రజలు నాలుగోసారి ముఖ్యమంత్రిగా తనను ఎన్నుకున్నారని చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు.