Pawan Kalyan: విశాఖను వీడేది లేదు.. జైలుకు వెళ్లేందుకైనా సిద్ధం..

Pawan Kalyan: ఎన్నికేసులు పెట్టినా సరే విశాఖను వీడేది లేదని పవన్ కళ్యాణ్ స్పష్టంచేశారు.

Update: 2022-10-16 09:18 GMT

Pawan Kalyan: విశాఖను వీడేది లేదు.. జైలుకు వెళ్లేందుకైనా సిద్ధం..

Pawan Kalyan: ఎన్నికేసులు పెట్టినా సరే విశాఖను వీడేది లేదని పవన్ కళ్యాణ్ స్పష్టంచేశారు. విశాఖ పర్యటనకు వచ్చేలోపే గొడవజరిగితే తానెలా బాధ్యుడని జనసేనాని పవన్ కళ్యాణ్ పోలీసులను ప్రశ్నించారు. రుషికొండపై కబ్జాదారుల విధ్వంసాన్ని వెలికి తెస్తామన్న ‎ఉద్ధేశంతో డ్రోన్లకు అనుమతి ఇవ్వలేదని పవన్ కళ్యాణ్ తెలిపారు. మేం విశాఖ రాకముందే గొడవ జరిగింది. మేం వచ్చి రెచ్చగొట్టడం వల్లే ఘటన జరిగినట్లుగా నోటీసులిచ్చారు. ఎన్ని కేసులు పెట్టినా.. జైలుకు వెళ్లేందుకైనా సిద్ధం. నేర చరిత్ర గల నేతలు పోవాలంటే ప్రజల్లో మార్పు రావాలి. ప్రజల్లో మార్పు వచ్చే వరకు మేం పోరాడతాం. ప్రశ్నించేతత్వం లేకపోతే దోపిడీలు ఎక్కువైపోతాయి అని పవన్ కళ్యాణ్ తెలిపారు.

Full View
Tags:    

Similar News