పాయకరావుపేట చేరుకున్న ఐ స్టాండ్ ఫర్ ది నేషన్ సభ్యుల సైకిల్ యాత్ర

యువత దేశభక్తిని అలవరచుకోవాలని ఐ స్టాండ్ ఫర్ ది నేషన్ సభ్యులు గణేష్ నాగ్ మరియు యుగంధర్ లు తెలిపారు.

Update: 2020-01-31 14:45 GMT

పాయకరావుపేట : యువత దేశభక్తిని అలవరచుకోవాలని ఐ స్టాండ్ ఫర్ ది నేషన్ సభ్యులు గణేష్ నాగ్ మరియు యుగంధర్ లు తెలిపారు. ఫిబ్రవరి 14 న పుల్వామా దాడిలో అసువులు బాసిన వీర జవాన్లకు నివాళి అర్పిస్తూ జనవరి 26 న గణతంత్ర దినోత్సవం నాడు ఐ స్టాండ్ ఫర్ ది నేషన్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో హైదరాబాద్ నుండి విశాఖపట్నం వరకూ నిర్వహిస్తున్న 700 కిలోమీటర్ల సైకిల్ యాత్ర చేస్తున్న ఐ స్టాండ్ ఫర్ ది నేషన్ ప్రతినిధులు దొడ్డి గణేష్ నాగ్, బీశెట్టి యుగంధర్ లు శ్రీ ప్రకాష్ విద్యా సంస్థలకు శుక్రవారం చేరుకున్నారు.

వీరిని శ్రీ ప్రకాష్ విద్యా సంస్థల అనుబంధ సంస్థ అయిన స్పేసేస్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డా.కే.వీర్రాజు, వైస్ ప్రిన్సిపల్ పెనుగొండ సుబ్బారావు, డైరెక్టర్ బంగార్రాజు, విద్యార్థినీ విద్యార్థులు తదితరులు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా వీరు మాట్లాడుతూ గత ఏడాది ఫిబ్రవరి 14 వ తేదీన పుల్వామాలో బస్సులో ప్రయాణిస్తున్న 40 మంది భారత సైనికులను తీవ్రవాదులు బలి తీసుకున్నారని చెప్పారు.

మన దేశ రక్షణలో భాగంగా ప్రాణాలను సైతం లెక్క చేయకుండా 24 గంటలు సరిహద్దుల్లో నిలబడి రక్షణగా నిలుస్తున్న వీరజవాన్లకు అండగా మేమువున్నామని భావన కల్పించేందుకు ఈ కార్యక్రమాన్ని చేపట్టామని తెలిపారు. ఫిబ్రవరి 14 వ తేదీ ప్రతీ భారతీయుడు నేను నా దేశం కోసం నిలబడతాను అనే నినాదంతో కొద్దిసేపు నిలబడి పుల్వామా దాడిలో వీర మరణం పొందిన వారికి నివాళులు అర్పించాలన్నారు. ఈ కార్యక్రమం పై అవగాహన కల్పించేందుకు ఈ యాత్ర చేపట్టి విద్యార్థులను దేశ భక్తి అలవర్చుకోవాలని ఈ సైకిల్ యాత్ర ద్వారా తెలుపుతున్నామని తెలిపారు.


Tags:    

Similar News