శ్రీశైలం మల్లికార్జునస్వామి ఆలయంలో భక్తుల రద్దీ.. దర్శనానికి 5 గంటలకు పైగా సమయం
Srisailam: భక్తజనంతో నిండిపోయిన ఆలయ క్షేత్రం
శ్రీశైలం మల్లికార్జునస్వామి ఆలయంలో భక్తుల రద్దీ.. దర్శనానికి 5 గంటలకు పైగా సమయం
Srisailam: కర్నూలు జిల్లా శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జునస్వామిల ఆలయానికి భక్తుల రద్దీ పెరిగింది. స్వామి అమ్మవార్ల దర్శనానికి 5 గంటలకు పైగా సమయం పడుతోంది. ఆలయ క్షేత్రమంతా భక్తజనంతో నిండిపోయింది. భక్తులు వేకువజాము నుంచే పాతాళగంగలో పుణ్యస్నానాలు ఆచరించిన శ్రీ భ్రమరాంబ మల్లికార్జునస్వామి అమ్మవార్లను దర్శించుకుంటున్నారు. క్యూలైన్లు, దర్శన కంపార్టుమెంట్లలో భక్తులు బారులు తీరారు. దీంతో భక్తులు రద్దీ దృష్ట్యా క్యూలైన్లలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు ఏర్పాట్లు చేశారు. క్యూలైన్లలో వేచి ఉన్న భక్తులకు అల్పాహార, నీరు అందిస్తున్నట్లు అధికారులు తెలిపారు.