Taneti Vanitha: కొందరు కావాలనే అల్లర్లు సృష్టిస్తున్నారు..
Taneti Vanitha: కోనసీమ జిల్లాను అంబేద్కర్ కోనసీమ జిల్లా గా మార్చాలని స్థానిక ప్రజలు, అన్ని వర్గాలు, పార్టీలు డిమాండ్ చేశాయని హోంమంత్రి వనిత అన్నారు.
Taneti Vanitha: కొందరు కావాలనే అల్లర్లు సృష్టిస్తున్నారు..
Taneti Vanitha: కోనసీమ జిల్లాను అంబేద్కర్ కోనసీమ జిల్లా గా మార్చాలని స్థానిక ప్రజలు, అన్ని వర్గాలు, పార్టీలు డిమాండ్ చేశాయని హోంమంత్రి వనిత అన్నారు. ఈ నేపథ్యంలో అంబేద్కర్ కోనసీమ జిల్లాగా ఈ మధ్యనే పేరు మార్చినట్లు తెలిపారు. అంబేద్కర్ ఎంతో మందికి స్ఫూర్తి దాయకమన్నారు. అలాంటి మహానుభావుని పేరును ఒక జిల్లాకు నామకరణం చేయడాన్ని వ్యతిరేకించడం బాధాకరమని వనిత అన్నారు. కోనసీమ జిల్లా ప్రజల అభీష్టం మేరకే అంబేద్కర్ కోనసీమ గా పేరు మార్చిన విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలన్నారు. కొందరు ఉద్దేశపూర్వకంగా గొడవలు, అల్లర్లు సృష్టిస్తున్నారని మండిపడ్డారు. గొడవలకు కారణమని వారిని గుర్తించి చర్యలు తీసుకుంటామని హోంమంత్రి హెచ్చరించారు.