ఏపీలో ఈ నెల 20, 21న సెలవు దినాలు

Update: 2020-03-12 04:01 GMT

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా ఈ నెల 21న ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే.. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఈ నెల 20, 21న సెలవు ప్రకటించింది. అలాగే ఎన్నికలు జరిగే 48 గంటలు ముందు అన్ని పోలింగ్‌ స్టేషన్ల పరిసరాల్లో మద్యం షాపులు మూసి వేసేలా కలెక్టర్లు చర్యలు తీసుకోవాలని సీఎస్‌ నీలం సాహ్నీ ఆదేశించారు. అంతేకాదు డబ్బులు పంపిణి చర్యను అరికట్టాలని ఇందుకోసం.. పోలీస్ శాఖ ప్రత్యేక టీమ్ లను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.

నామినేషన్ల అనంతరం సమస్యాత్మక ప్రాంతాల్లో పోలీసులు పర్యటించి పరిస్థితిని సమీక్షించాలని సూచించారు. ఇక రాష్ట్రంలో కరోనా వైరస్‌ వ్యాధి నిరోధక చర్యల్లో పాల్గొనాల్సి ఉన్నందున క్షేత్రస్థాయి వైద్య ఆరోగ్యశాఖ సిబ్బందిని స్థానిక సంస్థల ఎన్నికల విధులకు వినియోగించొద్దని సీఎస్‌ నీలం సాహ్ని అధికారులను ఆదేశించారు. స్థానిక సంస్థల ఎన్నికలు పకడ్బందీగా జరిగేలా అధికారులు అంతా పనిచేయాలని ఆంధ్రప్రదేశ్ సీఎస్ నీలం సాహ్ని వివిధ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. 

Tags:    

Similar News