తిరుపతిలో భూమన ఇంటి దగ్గర హైటెన్షన్
Bhumana Karunakar Reddy: తిరుపతిలో భూమన ఇంటిదగ్గర హై టెన్షన్ వాతావరణం నెలకొంది.
Bhumana Karunakar Reddy: తిరుపతిలో భూమన ఇంటిదగ్గర హై టెన్షన్ వాతావరణం నెలకొంది. భూమన కరుణాకర్ ఇంటిదగ్గర భారీగా పోలీసులు మోహరించారు. నిన్న అసెంబ్లీ వేదికగా బాలకృష్ణ జగన్‌ను సైకో అంటూ సంబోధించారు. దాంతో వైసీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. తిరుపతిలో పార్టీ శ్రేణులు బాలకృష్ణ దిష్టిబొమ్మ దహనానికి యత్నించగా పోలీసులు వారిని అడ్డుకున్నారు. బాలకృష్ణ ఫొటోతో కూడిన బ్యానర్‌లను లాక్కొన్నారు. మళ్లీ దిష్టిబొమ్మ దగ్ధం చేస్తారన్న అనుమానంతో భూమన ఇంటి దగ్గర భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.