TS High Court: తెలంగాణలో కరోనా, ఒమిక్రాన్ పరిస్థితులపై హైకోర్టు విచారణ
TS High Court: న్యూ ఇయర్ వేడుకలకు ప్రభుత్వ ఉత్తర్వులను రద్దు చేయాలని కోరిన పిటిషనర్లు
తెలంగాణలో కరోనా, ఒమిక్రాన్ పరిస్థితులపై హైకోర్టు విచారణ
TS High Court: తెలంగాణలో కరోనా, ఒమిక్రాన్ పరిస్థితులపై హైకోర్టులో విచారణ జరిగింది. న్యూ ఇయర్ వేడుకలకు ప్రభుత్వ ఉత్తర్వులను రద్దు చేయాలని పిటిషనర్లు కోరారు. రాష్ట్రంలో ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్నాయని కోర్టుకు తెలిపారు పిటిషనర్స్. ఒమిక్రాన్ కేసులు గుర్తించి కంటైన్మెంట్ జోన్, మైక్రో కంటైన్మెంట్ జోన్లుగా ప్రకటించాలని పిటిషనర్స్ కోరగా ఇంతవరకు ప్రభుత్వం ఎలాంటి కంటైన్మెంట్ జోన్లు ఏర్పాటు చేయలేదని కోర్టుకు తెలిపారు.
కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన గైడ్‌లెన్స్‌ను తప్పకుండా పాటించాలని ప్రభుత్వానికి హైకోర్టుల అదేశించింది. రాష్ట్రంలో ఒమిక్రాన్ పరిస్థితులపై జనవరి 3 లోపు హైకోర్టుకు నివేదిక ఇవ్వాలని ఆదేశాలు జరీ చేసింది. తదుపరి విచారణ జనవరి 4కి వాయిదా వేసింది ధర్మాసనం