సీఆర్డీఏ రద్దుపై హైకోర్టులో విచారణ రేపటికి వాయిదా

Update: 2020-01-22 11:05 GMT

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజధాని తరలింపు, సీఆర్డీఏ చట్టం రద్దుపై హైకోర్టులో పిటిషన్ దాఖలవ్వడంతో విచారణ జరిగింది. ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నారని పిటిషనర్ తరపు న్యాయవాది వాదనలు వినిపించారు. మండలిలో చర్చ జరుగుతోందని హైకోర్టుకు అడ్వకేట్‌ జనరల్‌ తెలిపారు. అనంతరం తదుపరి విచారణను హైకోర్టు రేపటికి వాయిదా వేసింది.

ఇదిలాఉండగా.. రాజధాని గ్రామాల్లో 144 సెక్షన్, పోలీస్ యాక్ట్ 30 అమలుపై హైకోర్టులో నేడు విచారణ జరిగింది. ఆందోళనల సమయంలో మహిళలపై అనుచితంగా ప్రవర్తించిన పోలీసులపై విచారణ చేస్తున్నామని ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ హైకోర్టుకు వివరించారు. సదరు పోలీసులపై చర్యలకు కొంత సమయం కావాలని కోర్టును కోరారు. ఇరు పక్షాల వాదనలు విన్న హైకోర్టు తదుపరి విచారణను ఫిబ్రవరి 3కి వాయిదా వేసింది.

Tags:    

Similar News