వరద నీటిలో చిక్కుకున్న చంద్రబాబు హెలీప్యాడ్‌

Update: 2019-08-17 03:52 GMT

ఎగువనుంచి వస్తున్న వరద ప్రవాహంతో ప్రకాశం బ్యారేజీలోకి వరద ఉదృతి అంతకంతకూ పెరుగుతోంది. దీంతో వచ్చిన వరదను వచ్చినట్టే దిగువకు విడుదల చేస్తున్నారు అధికారులు. దీంతో కృష్ణానదీ తీరానా వరదనీరు ఎక్కువైంది. దీంతో కరకట్ట మీద ఇళ్లలోకి వరదనీరు వచ్చేసింది. వరద మరింత పెరిగే అవకాశం ఉండటంతో లంక గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతానికి వెళ్లాలని అధికారుల హెచ్చరించారు. ఇక ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు నివాసం వద్ద పెద్ద ఎత్తున వరద పోటెత్తుతుంది. అందులోని రివర్‌ ఫ్రంట్‌ వ్యూ భవనం, వాక్‌వే, గార్డెన్‌, హెలీప్యాడ్‌ ప్రాంతం వరదమయమైంది. చంద్రబాబు నివాసంలోకి వరద నీరు రాకుండా 10 ట్రక్కుల చిప్స్, ఇసుక బస్తాలను ఏర్పాటు చేశారు. చంద్రబాబు నివాసంలోని పంటపొల్లలోకి కూడా వరద నీరు భారీగా చేరుతోంది. 

Tags:    

Similar News