Polavaram: పోలవరం నీటినిల్వ 41.15 మీటర్లకే పరిమితమని స్పష్టం
Polavaram: తొలిదశ సహాయ, పునరావాసం అంతవరకేనని తేల్చి చెప్పిన కేంద్రం
Polavaram: పోలవరం నీటినిల్వ 41.15 మీటర్లకే పరిమితమని స్పష్టం
Polavaram: పోలవరం ప్రాజెక్ట్‌పై కేంద్రం కీలక ప్రకటన చేసింది. పోలవరం నీటినిల్వ 41.15 మీటర్లకే పరిమితమని స్పష్టం చేసింది. తొలిదశ సహాయ, పునరావాసం అంతవరకేనని కేంద్రం తేల్చి చెప్పింది. లోక్‌సభలో వైసీపీ ఎంపీ వెంకట సత్యవతి అడిగిన ప్రశ్నకు కేంద్ర జలశక్తి శాఖ సహాయమంత్రి ప్రహ్లద్‌సింగ్ పటేల్ సమాధానం ఇచ్చారు. తొలిదశలో 20 వేల 946 నిర్వాసిత కుటుంబాలకు సహాయ, పునరావాసం కల్పించాల్సి ఉండగా... ఏపీ ప్రభుత్వం కేవలం 11 వేల 677 కుటుంబాలకే ఇచ్చిందని పేర్కొంది. మిగిలిన వారికి మార్చి 2023 నాటికి పూర్తి చేయాల్సి ఉన్నా.. ఇంతవరకు చేయలేదని ప్రహ్లద్‌సింగ్ పటేల్ పేర్కొన్నారు.