తిరుపతి జిల్లాలో భారీ వర్షాలు.. పొంగిపొర్లుతున్న వాగులు, వంకలు

Tirupati: ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలు

Update: 2023-12-04 04:52 GMT

తిరుపతి జిల్లాలో భారీ వర్షాలు.. పొంగిపొర్లుతున్న వాగులు, వంకలు

Rains: తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. గ్రామీణ ప్రాంతాలలో కాజ్‌వేలపై నుంచి నీరు ప్రవహిస్తుండడంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఎడతెరపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా జనజీవనం పూర్తిగా స్తంభించింది.

కాజ్‌వేలపై నుంచి నీరు ప్రవహిస్తుండడంతో తొట్టంబేడు మండలంలోని బోనుపల్లి, అంజూరు, సూరమాల, కంచనపల్లి, గుండిపేడు, కాళంగి, రంగయ్యగుంట, ఆదవరం గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. పొలాల్లోకి నీరు చేరడంతో పంట పొలాలు చెరువులను తలపిస్తున్నాయి. లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు అధికారులు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.

Tags:    

Similar News