Weather Update: బంగాళాఖాతంలో అల్పపీడనం.. నేడు, రేపు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు
Weather Update: నేడు, రేపు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.
Weather Update: నేడు, రేపు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఉత్తర, మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం కేంద్రీకృతమైందని.. అది వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది. రేపు ఉదయానికి దక్షిణ ఒడిశా-ఉత్తరాంధ్ర తీరాలను దాటే అవకాశం ఉందని దీని ప్రభావంతో రెండు రాష్ట్రాల్లో అతిభారీ వర్షాలు కురిచే అవకాశం ఉందని తెలిపింది.
ఉత్తరాంధ్ర, ఉభయ గోదావరి, నెల్లూరు, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిచే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. తీరం వెంట గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉన్నట్టు తెలిపింది. రాబోయే మూడు రోజులు మత్స్యకారులు వేటకు వెళ్ళొద్దని ఏపీ విపత్తుల నిర్వహణ ఎండీ ప్రఖార్ జైన్ వెల్లడించారు.