తెలుగు రాష్ట్రాలకు భారీ వర్షసూచన

Update: 2019-08-22 03:55 GMT

తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీని ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ సూచన చేసింది. ఈ నేపథ్యంలో తెలంగాణలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని.. అలాగే కోస్తాంధ్ర, రాయలసీమలోనూ ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురవనున్నట్టు పేర్కొంది. కోస్తాంధ్రలో పలుచోట్ల పిడుగులు పడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. ఇదిలావుంటే ఇప్పటికే ఎగువన కురిసిన వర్షాలతో కృష్ణా, గోదావరి నదులు ఉప్పొంగిన సంగతి తెలిసిందే. 

Tags:    

Similar News