Weather Update: తెలుగు రాష్ట్రాల్లో ఇక వర్షాలే వర్షాలు.. వెదర్ రిపోర్ట్

Weather Update: తెలుగు రాష్ట్రాల్లో వరుసగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది.

Update: 2025-07-05 06:55 GMT

Weather Update: తెలుగు రాష్ట్రాల్లో ఇక వర్షాలే వర్షాలు.. వెదర్ రిపోర్ట్

Weather Update: తెలుగు రాష్ట్రాల్లో వరుసగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈశాన్య అరేబియా సముద్రం నుండి వాయవ్య బంగాళాఖాతం వరకు ద్రోణి విస్తరించి ఉండటం వల్ల ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తాయి. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు మరో మూడు రోజుల పాటు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చిరించింది. వెదర్ రిపోర్ట్ వివరాలు..

ఈశాన్య అరేబియా సముద్రం నుండి వాయవ్య బంగాళాఖాతం వరకు ద్రోణి విస్తరించి ఉందని తాజాగా వాతావరణ శాఖ వెల్లడించింది. ప్రస్తుతుం ఇది గుజరాత్‌ నుండి పశ్చిమ బెంగాలోని గంగా తీరంలోని ఉత్తర ప్రాంతాల మీదుగా ఉపరితలం ఆవర్తనం కొనసాగుతోంది. దీంతో మధ్య ప్రదేశ్‌, చత్తీస్ గడ్, జార్ఖండ్ మీదుగా సగటు సముద్ర మట్టానికి 3.1 కిమీ ఎత్తులో ద్రోణి ప్రభావం విస్తరించి ఉంది. దీనివల్ల ఉత్తరకోస్తా, యానాంలో వర్షాలు కురుస్తాయి. వీటి చుట్టుపక్కల ఉరుములతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది.

తెలంగాణాలోనూ వర్షాలే..

తాజా సమాచారం ప్రకారం, తెలంగాణలోని పలు ప్రాంతాల్లో ఉరములు, మెరుపులతో కూడిన వర్షాలు పడనున్నాయి. ముఖ్యంగా శని,ఆది,సోమవారాల్లో గంటకు 30 నుంచి 40 కిమీ వేగంతో ఈదరు గాలులు వీస్తాయి. అదేవిధంగా తేలికాపాటి లేదా మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. మంచిర్యాల, నిర్మల్, కొమరం భీం, ఆదిలాబాద్, నిజమాబాద్, ఖమ్మం, మహబూబ్ నగర్, వరంగల్, హన్మకొండ, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్‌ జిల్లాలో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. పలు చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉంది, కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు హెచ్చిరంచారు.

Tags:    

Similar News