ఎమ్మెల్యే కోటంరెడ్డికి తీవ్ర అస్వస్థత.. చెన్నై అపోలో ఆస్పత్రికి తరలింపు..
MLA Kotamreddy: నెలూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి అస్వస్థతకు గురయ్యారు.
ఎమ్మెల్యే కోటంరెడ్డికి తీవ్ర అస్వస్థత.. చెన్నై అపోలో ఆస్పత్రికి తరలింపు..
MLA Kotamreddy: నెలూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి అస్వస్థతకు గురయ్యారు. 47 రోజులుగా తన నియోజకవర్గంలో జగన్నన మాట.. కోటం రెడ్డి బాట అనే కార్యక్రమాన్ని నిర్వహించిన కోటం రెడ్డి.. శుక్రవారం కూడా నియోకజకవర్గంలో ఇంటింటికీ వెళ్లి ప్రజల సమస్యలు తెలుసుకుంటున్నారు. ఈ క్రమంలో ఆయనకు స్వల్పంగా గుండెపోటు రావడంతో నెల్లూరులోని అపోలో ఆస్పత్రికి తరలించారు. మెరుగైన చికిత్స కోసం కుటుంబసభ్యులు ఆయన్ను చెన్నై అపోలో ఆస్పత్రికి తరలించారు. అపోలో ఆసుపత్రిలో ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి పరామర్శించారు. ఎమ్మెల్యే ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు.