విశాఖకు ప్రభుత్వ కార్యాలయాల తరలింపుపై నేడు హైకోర్టులో విచారణ

AP High Court: ప్రభుత్వ జీవోను నిలిపివేయాలన్న పిటిషనర్‌

Update: 2023-12-20 05:41 GMT

విశాఖకు ప్రభుత్వ కార్యాలయాల తరలింపుపై నేడు హైకోర్టులో విచారణ

AP High Court: విశాఖకు ప్రభుత్వ కార్యాలయాల తరలింపుపై ఇవాళ ఏపీ హైకోర్టులో విచారణ జరగనుంది. ప్రభుత్వ కార్యాలయాలను విశాఖకు తరలిస్తూ.. ప్రభుత్వం తీసుకొచ్చిన జీవోను నిలిపివేయాలని పిటిషన్‌ దాఖలైంది. అయితే.. పిటిషన్‌కు విచారణ అర్హత లేదని అభ్యంతరం వ్యక్తం చేశారు ప్రభుత్వ తరఫు న్యాయవాది. విచారణ అర్హతపై పిటిషనర్‌ తరఫు న్యాయవాది కూడా రిప్లయ్‌ ఇవ్వడంతో.. నేడు ఇరువర్గాల వాదనలు విననుంది ధర్మాసనం. ఇరువైపుల వాదనలు విన్నాక.. విచారణ అర్హత ఉందో లేదో వెల్లడించి.. పిటిషన్‌పై ముందుకు వెళ్తామంది ఏపీ హైకోర్టు.

Tags:    

Similar News