ఐటీ శాఖ మంత్రితో హెచ్‌సీఎల్ ప్రతినిధులు భేటీ

ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డితో హెచ్‌సీఎల్ ప్రతినిధులు సమావేశమయ్యారు.

Update: 2019-11-12 17:01 GMT
mekapati goutham reddy

ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డితో హెచ్‌సీఎల్ ప్రతినిధులు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో నైపుణ్య శిక్షణపై ప్రధానంగా చర్చించారు. యువతీ, యువకులకు నైపుణ్య శిక్షణ అందించే అంశాలు నూతన కోర్సులపై హెచ్‌సీఎల్ ప్రతినిధులు మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి వివరించారు.

జనవరి నుంచి హెచ్‌సీఎల్ నిర్వహించనున్న శిక్షణాపరమైన కార్యక్రమాలను సందర్శించాలని హెచ్ సీచ్ ప్రతినిధులు మంత్రిని కోరారు. ఈ సందర్భంగా హెచ్ సీఎల్ ప్రతినిధులతో మాట్లాడిన మంత్రి యువతకు శిక్షణకు వసూలు చేసే ఖర్చు తగ్గించాలని మంత్రి వారిని కోరారు. అలాగే 'టెక్ బీ' కార్యక్రమంలో యువతకు ఉపాధి అవకాశాలుతోపాటు తగిన శిక్షణ అందించాలని మంత్రి వారిని కోరారు. అందుకు హెచ్‌సీఎల్ ప్రతినిధులు సుముఖత వ్యక్తం చేశారు. తనతో జరిగిన సమావేశంలోని చర్చ సారాంశాన్ని సీఎం జగన్ దృష్టికి తీసుకువెళ్తామని మంత్రి హామీ ఇచ్చారు. ఈ భేటీలో హెచ్‌సీఎల్ ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్ రవిశంకర్ హాజరైయ్యారు. అనంతరం గుంటూరు జిల్లా మంగళగిరిలో నిర్వహించిన 23వ ప్రాడక్ట్ కమ్ కాటలాగ్ షో కార్యక్రమానికి మంత్రి హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి వస్త్రాలను నాణ్యమైన రీతిలో తీర్చిదిద్దడంలో కళాకారుల నైపుణ‌్యం కొనియాడదగిందన్నారు. ఈ కార్యక్రమానికి వివిధ రాష్ట్రాలకు చెందిన వస్త్ర పరిశ్రమ ప్రముఖులు హాజరయ్యారు. 

Tags:    

Similar News