Guntur : గుంటూరు ఆర్వోబీ పనులు 2027 జూలైలో పూర్తి: పెమ్మసాని

గుంటూరు ఆర్వోబీ పనులు 2027 జూలై నాటికి పూర్తి చేస్తాం: కేంద్ర సహాయమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్

Update: 2026-01-02 10:49 GMT

Guntur : గుంటూరు ఆర్వోబీ పనులు 2027 జూలైలో పూర్తి: పెమ్మసాని

గుంటూరులోని శంకర్‌ విలాస్‌ సమీపంలో నిర్మిస్తోన్న ఆర్వోబీని 2027 జులై నాటికి పూర్తి చేస్తామని కేంద్ర సహాయమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. ఆర్వోబీ పనుల్ని ప్రజా ప్రతినిధులు, అధికారులతో కలిసి ఆయన పరిశీలించారు. అనుకున్న లక్ష్యం మేరకు వంతెన నిర్మాణం పూర్తి చేస్తామని, నిర్దేశిత తేది లోపు పూర్తి కాకపోతే అప్పుడు నిలదీయాలని ప్రజలకు సూచించారు. అరండల్ పేటలోని దుకాణాల వారు మరో రెండు నెలలు వ్యాపారాలు నిర్వహించుకునే అవకాశం ఇస్తూ.. ఇప్పుడు జీజీహెచ్ వైపు పనులు చేస్తున్నట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఆర్వోబీకి నిధులు ఇవ్వలేదన్న ఆరోపణల్ని ఖండించారు. రైల్వేట్రాక్‌పై ఉన్న పాత వంతెన తొలగింపు పనులు రెండు వారాల్లో ప్రారంభిస్తామని కేంద్ర సహాయమంత్రి పెమ్మసాని తెలిపారు.

Tags:    

Similar News