Pinnelli Ramakrishna Reddy: మాచర్ల కోర్టులో లొంగిపోయిన పిన్నెల్లి సోదరులు
Pinnelli Ramakrishna Reddy: గుండ్లపాడు జంట హత్యల కేసులో నిందితులుగా ఉన్న వైకాపా (YSRCP) నాయకుడు, మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి (Pinnelli Ramakrishna Reddy) మరియు ఆయన సోదరుడు పిన్నెల్లి వెంకట్రామిరెడ్డి గురువారం నాడు కోర్టులో లొంగిపోయారు.

సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు, ఈ సోదరులిద్దరూ గురువారం ఉదయం పల్నాడు జిల్లాలోని మాచర్లలో ఉన్న జూనియర్ అదనపు సివిల్ జడ్జి కోర్టుకు హాజరయ్యారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కోర్టు పరిసరాల్లో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
మే 24న వెల్దుర్తి మండలం గుండ్లపాడుకు చెందిన తెదేపా (TDP) నాయకులు, సోదరులైన జవ్విశెట్టి వెంకటేశ్వర్లు, కోటేశ్వరరావులు హత్యకు గురైన సంగతి తెలిసిందే. ఈ హత్యల కేసులో పిన్నెల్లి సోదరులు గ్రామంలోని ఆధిపత్య పోరును తమకు అనుకూలంగా వాడుకుని, జంట హత్యలకు పరోక్షంగా సహకరించారనే ఆరోపణలపై పోలీసులు వారిని A-6, A-7 నిందితులుగా చేర్చి కేసు నమోదు చేశారు.
ఈ కేసులో పిన్నెల్లి సోదరులు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌ను మొదట కింది కోర్టు, ఆ తర్వాత హైకోర్టు రద్దు చేశాయి. దీంతో వారు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అక్కడ కూడా బెయిల్ పిటిషన్ రద్దవగా, రెండు వారాల్లోగా లొంగిపోవాలని సుప్రీంకోర్టు గత వారం స్పష్టం చేసింది. సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలోనే పిన్నెల్లి సోదరులు నేడు కోర్టు ముందు లొంగిపోయారు.