Gudivada Amarnath: పవన్ కళ్యాణ్ పై మంత్రి గుడివాడ అమర్‌నాథ్ సెటైర్లు

Gudivada Amarnath: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై మంత్రి గుడివాడ అమర్నాథ్ సెటైర్లు వేశారు.

Update: 2023-08-11 14:15 GMT

Gudivada Amarnath: పవన్ కళ్యాణ్ పై మంత్రి గుడివాడ అమర్‌నాథ్ సెటైర్లు

Gudivada Amarnath: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై మంత్రి గుడివాడ అమర్నాథ్ సెటైర్లు వేశారు. విశాఖలో మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన పవన్ కళ్యాణ్‌ని చూస్తే జాలేస్తుందన్నారు. సంసారం బీజేపీతో.. సహజీవనం టీడీపీతో పవన్‌ చేస్తున్నాడు. ఇప్పటికే పవన్‌ ఆరేడు పార్టీలతో పొత్తు పెట్టుకున్నాడు. చంద్రబాబు ఏం చెబితే దానికి పవన్‌ వత్తాసు పలుకుతాడు. ఆయనకు పొలిటికల్‌ ప్రొడ్యూసర్‌ చంద్రబాబు అంటూ దుయ్యబట్టారు. పవన్ కళ్యాణ్‌కు రాజకీయాలపై ఏమాత్రం అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని ఆయన అన్నారు. మూడో విడత వారాహియాత్రలో భాగంగా విశాఖ వచ్చిన పవన్ కళ్యాణ్ తన ప్రసంగాల్లో సీఎం జగన్ ని తిట్టడమే పనిగా పెట్టుకున్నారని ఆయన అన్నారు. కనీసం స్టీల్ ప్లాంట్ గురించి ప్రస్తావించకపోవడం విచారకరమన్నారు.

Tags:    

Similar News