Pattu Saree Cake: పట్టుచీర ఆకారంలో కేక్.. నిశ్చయ తాంబూలాల్లో ఆకట్టుకున్న పట్టుచీర కేక్ సారె

Pattu Saree Cake: పట్టుచీర కేకు ఇచ్చి సర్‌ప్రైజ్‌ చేసిన పెళ్లి కుమారుడు

Update: 2023-09-07 09:52 GMT

Pattu Saree Cake: పట్టుచీర ఆకారంలో కేక్.. నిశ్చయ తాంబూలాల్లో ఆకట్టుకున్న పట్టుచీర కేక్ సారె

Pattu Saree Cake: అంబేడ్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో ఎంగేజ్ మెంట్‌కు పెళ్లికూతురుని సర్‌ప్రైజ్ చేయడానికి పెళ్లి కుమారుడు ప్రత్యేకంగా కేక్ పట్టుచీర సారెను తయారు చేయించారు. అమలాపురానికి చెందిన వైష్ణవి స్వీట్స్ లో 15వేల రూపాయలతో వేరైటీ గా తయారు చేయించారు. కేక్ పై నగలు, గాజులు, పసుపు, కుంకుమ బరిణి ఏర్పాటు చేశారు.

కోనసీమ ప్రకృతి అందాలకు, ఆతిథ్యానికే కాదు.. వెరైటీలకు కూడా మారుపేరుగా మారుతుంది. కొత్త అల్లుడుకి చేసే మర్యాదల గురించి తరచుగా వింటూనే ఉన్నాం.. ఇక నిన్న రాజమండ్రి లో ఓ నిశ్చయ తాంబూలాల వేడుకలో 108 రకాల స్వీట్స్ తో సరే పెట్టి కోనసీమ ఆతిథ్యం చూపిస్తే.. ఈరోజు అమలాపురం లో ఎంగేజ్మెంట్ కు పట్టుచీర కేకు తయారు చేసి పెళ్లికూతురికి సర్‌ప్రైజ్ ఇచ్చిన పెళ్లి కుమారుడు. అంబెడ్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో పెళ్ళికొడుకు బంధువులు ఇచ్చిన ఈ పట్టుచీర కేక్ ను చూసేందుకు బంధువులు క్యూ కట్టారు.

కోనసీమ అందాలను తలపించేలా పట్టు చీర కేక్ ను ఎరుపు రంగు అంచు, పచ్చ రంగు తో సుందరంగా ఉంది. అంతేకాదు అమ్మాయికి చీరతో పాటు నగలను పెట్టి ఇచ్చే సందర్భాన్ని గుర్తు చేస్తూ.. పట్టు చీర కేక్ మీద అదనపు హంగులుగా బంగారు నగలు, గాజులు,నెక్లెస్, కుంకుమ భరిణ వంటి వస్తువులను టాపింగ్ చేశారు. దీంతో ఈ పట్టు చీర నిజమై అన్నంత అందంగా కన్పిస్తూ కనువిందు చేస్తోంది.

Tags:    

Similar News