AP Liquor Scam: ఏపీ మద్యం కుంభకోణం.. కీలక నిందితుడు అరెస్ట్‌

AP Liquor Scam: ఏపీ మద్యం కుంభకోణం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న గోవిందప్ప బాలాజీని సిట్ అధికారులు అరెస్టు చేశారు.

Update: 2025-05-13 07:13 GMT

AP Liquor Scam: ఏపీ మద్యం కుంభకోణం.. కీలక నిందితుడు అరెస్ట్‌

AP Liquor Scam: ఏపీ మద్యం కుంభకోణం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న గోవిందప్ప బాలాజీని సిట్ అధికారులు అరెస్టు చేశారు. పక్కా సమాచారంతో మైసూరులో బాలాజీని అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. మైసూరు నుంచి ట్రాన్సిట్ వారెంట్ తో బాలాజీని విజయవాడకు తరలిస్తున్నట్లు అధికార వర్గాల సమాచారం.

అనంతరం ట్రాన్సిట్ వారెంట్‌తో విజయవాడకు తరలిస్తున్నట్లు సమాచారం. బాలాజీ అరెస్టుతో ఏపీ మద్యం కుంభకోణం కేసులో అరెస్టుల సంఖ్య 5కి చేరింది. భారతి సిమెంట్స్ కంపెనీలో డైరెక్టర్‌గా గోవిందప్ప బాలాజీ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మద్యం కుంభకోణంలో కీలక పాత్ర పోషించినట్లు అధికారులు భావిస్తున్నారు. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే పలువురిని అరెస్టు చేసిన సంగతి తెలిసిందే.

Tags:    

Similar News