అమ్మఒడి పథకం గడువు పొడిగించాలి
రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అమ్మ ఒడి పథకం వివరాలను ఆన్లైన్లో పొందుపరిచేందుకు నెట్వర్క్ సరిగా పని చేయనందున గడువు పొడిగించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
కడప: రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అమ్మ ఒడి పథకం వివరాలను ఆన్లైన్లో పొందుపరిచేందుకు నెట్వర్క్ సరిగా పని చేయనందున గడువు పొడిగించాలని యుటిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి లక్ష్మి రాజా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఆయన విలేకరులతో మాట్లాడుతూ నెట్వర్క్ సరిగా లేకపోవడంతో ప్రధానోపాధ్యాయులు తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నారని, ప్రభుత్వం, ఉన్నతాధికారులు పరిస్థితులను గమనించి సరిదిద్దాలన్నారు. ఈ కార్యక్రమంలో యుటిఎఫ్ జిల్లా అధ్యక్షులు సుబ్బరాజు, జిల్లా కార్యదర్శులు దావుద్దీన్, రమణ పాల్గొన్నారు.