SP Fakirappa: ఒరిజినల్ వీడియో ఉంటేనే ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపగలం..
Gorantla Madhav: ఎంపీ గోరంట్ల మాధవ్ వీడియోను ఎడిటింగ్ లేదా మార్ఫింగ్ చేసి ఉండొచ్చన్నారు అనంతపురం ఎస్పీ ఫకీరప్ప.
SP Fakirappa: ఒరిజినల్ వీడియో ఉంటేనే ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపగలం..
Gorantla Madhav: ఎంపీ గోరంట్ల మాధవ్ వీడియోను ఎడిటింగ్ లేదా మార్ఫింగ్ చేసి ఉండొచ్చన్నారు అనంతపురం ఎస్పీ ఫకీరప్ప. ఒరిజినల్ వీడియో దొరికే వరకు నిర్ధారణకు రాలేమన్నారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో ఒరిజినల్ కాదని ఎడిటింగ్ చేసి ఫార్వార్డ్ చేశారన్నారు ఎస్పీ ఫకీరప్ప. ఒరిజినల్ వీడియో ఉంటేనే ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపగలమన్నారు. వీడియోను మొదట iTDP official అనే వాట్సాప్ గ్రూపులో పోస్ట్ చేశారని తెలిపారు. ఈ నెల 4 అర్ధరాత్రి 2.07 గంటలకు +447443703968 నెంబర్ నుంచి పోస్ట్ చేసినట్లు చెప్పారు. సదరు నెంబరు యూకే వొడాఫోన్‌కు సంబంధించినదిగా గుర్తించామని ప్రకటించారు. సదరు వీడియోను వేరే మొబైల్ ద్వారా చిత్రీకరించారని, ఒరిజనల్ వీడియో దొరికే దాకా ఏమీ చెప్పలేమని ఎస్పీ తెలిపారు.