విశాఖలో గూగుల్ డేటా సెంటర్ – చంద్రబాబు నేతృత్వంలో ఏపీకి కీలక ఒప్పందం
ఢిల్లీలో గూగుల్ అనుబంధ సంస్థతో ఏపీ కీలక ఒప్పందం సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ సమక్షంలో అగ్రిమెంట్ విశాఖలో AI డేటా సెంటర్ ఏర్పాటుకు రైడెన్‌తో ఒప్పందం వచ్చే ఐదేళ్లలో రూ.88,628 కోట్ల పెట్టుబడులు పెట్టనున్న గూగుల్ నా రాజకీయ జీవితంలో గూగుల్ గొప్ప ఒప్పంద విజయం- చంద్రబాబు
విశాఖలో గూగుల్ డేటా సెంటర్ – చంద్రబాబు నేతృత్వంలో ఏపీకి కీలక ఒప్పందం
ఐటీ దిగ్గజ సంస్థ గూగుల్ విశాఖలో అడుగుపెడుతోందని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. గతంలో హైదరాబాద్‌లో హైటెక్ సిటీని అభివృద్ధి చేశామని.. ప్రస్తుతం విశాఖను ఐటీ హబ్‌గా తీర్చిదిద్దబోతున్నట్లు చెప్పారు. విశాఖపట్నంలో గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటుపై ఢిల్లీలో ఆ సంస్థతో ఏపీ ప్రభుత్వం ఒప్పందం సందర్భంగా భారత్ AI శక్తి పేరిట కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, అశ్వినీ వైష్ణవ్, రాష్ట్ర మంత్రి నారా లోకేశ్, గూగుల్ ప్రతినిధులు పాల్గొన్నారు.
ఆనాడు హైదరాబాద్‌కు మైక్రోసాఫ్ట్ తీసుకొచ్చాం... ప్రస్తుతం విశాఖకు గూగుల్‌ను తీసుకొస్తున్నామని అన్నారు సీఎ చంద్రబాబు. సాంకేతికతలో నూతన ఆవిష్కరణలు వస్తున్నాయని పేర్కొన్నారు. సాంకేతికను అందిపుచ్చుకోవడంలో ఏపీ ముందుంటుందన్నారు. 2047 నాటికి వికసిత్ భారత్ మనందరి లక్ష్యమని వ్యాఖ్యానించారు. ఐదేళ్లలో గూగుల్ 15 బిలియన్ డాలర్లు ఖర్చు పెడతామనడం సంతోషదాయకం అని సీఎం అన్నారు.