AP Government: ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్..అదనపు సెలవులు ప్రకటించిన సర్కార్
AP Government: ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్..అదనపు సెలవులు ప్రకటించిన సర్కార్
AP Government: ఏపీలోని కూటమి సర్కార్ వైద్యఆరోగ్య శాఖ కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు అదనంగా 5 క్యాజువల్ లీవ్స్ మంజూరు చేయాలని నిర్ణయించింది. అధికారిక ఉత్తర్వులు త్వరలోనే విడుదల కానున్నాయి. ఎన్నికల సమయంలో టీడీపీ కూటమి మహిళలు, ఉద్యోగులు, విద్యార్థులు, రైతులు తదితర వర్గాలకు అనేక హామీలు ఇచ్చిన సంగతి తెలిసిందే. అధికారంలోకి వచ్చిన తర్వాత పదే పదే ఇచ్చిన హామీలను అమలు చేస్తూ, ఉద్యోగుల సంక్షేమానికి పెద్ద పీట వేస్తూ వస్తోంది. ఈ క్రమంలోనే వైద్య ఆరోగ్య శాఖలోని కాంట్రాక్టు , ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు అదనపు సెలవులు మంజూరు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
ఇప్పటి వరకు వైద్య ఆరోగ్య శాఖలో కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు పరిమిత క్యాజువల్ లీవ్స్ మాత్రమే ఉండటంతో ఉద్యోగులు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వ్యక్తిగత అవసరాలు, ఆరోగ్యసమస్యలతో సెలవులు తీసుకోవాల్సి వచ్చినా, లీవ్స్ లేక ఇబ్బందిపడిన సందర్భాలు ఉన్నాయి. తమకు అదనపు సెలవులు మంజూరు చేయాలంటూ వారు ప్రభుత్వాన్ని పలుమార్లు కోరారు. ఉద్యోగుల విజ్నప్తులను పరిగణలోకి తీసుకున్న ప్రభుత్వం అదనంగా 5 క్యాజువల్ లీవ్స్ మంజూరుచేయాలని నిర్ణయించింది. త్వరలోనే ఇందుకు సంబంధించిన అధికారిక ఉత్తర్వులు విడుదల కానున్నాయి.