GBS Virus Symptoms: భయపెట్టిస్తోన్న జీబీఎస్ వైరస్.. ఈ లక్షణాలు కనిపిస్తే ఆసుపత్రికి వెళ్లండి.. లేదంటే ప్రాణాలే పోవచ్చు

Update: 2025-02-20 05:30 GMT

GBS Virus Symptoms: ఓ వైపు బర్డ్ ఫ్లూ..మరోవైపు జీబీఎస్ వైరస్. ప్రాణాంతకమైన వ్యాధి కాకపోయినప్పటికీ ప్రజల్లో మాత్రం భయం అంచలంచెలుగా పెరుగుతోంది. ప్రస్తుతం జీబీఎస్ వైరస్ వ్యాప్తి చెందుతున్న ఆ జిల్లాలో ప్రస్తుత పరిస్థితి ఏంటి. అక్కడి ఆసుపత్రిలో ఎంతమంది చికిత్స పొందుతున్నారో ఓసారి చూద్దాం.

గత 20రోజులుగా గోదావరి జిల్లాలను బర్డ్ ఫ్లూ వణికించింది. చికెన్ తింటే చాలు ప్రజలు ఇబ్బందులు పడతారంటూ ప్రచారం జోరుగా సాగింది. మరణించిన కోళ్లను చేపలకు ఆహారంగా వేస్తున్నారు. చేపలు కూడా తినకూడదని ప్రచారం జరిగింది. చివరకు గుడ్లుకు కూడా ప్రజలు దూరమైన పరిస్థితి నెలకొంది. ఇలాంటి పరిస్థితుల నుంచి బయటకు వస్తున్న ప్రజలు మరో వైరస్ తో ఇబ్బంది పడుతున్నారు.

ప్రస్తుతం ఏపీలో జీబీఎస్ వైరస్ విస్తురిస్తుంది. గుంటూరులో ఈ వైరస్ సోకి ఓ మహిళ మరణించిన సంగతి తెలిసిందే. దీంతో ఏపీలో అధికారులు మరింత అప్రమత్తమయ్యారు. తాజాగా గోదావరి జిల్లాలో కూడా ఈ వైరస్ ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే కాకినాడ జిల్లా కేంద్రంగా ఉన్న జీజీహెచ్ లో కొంతమంది ఈ వైరస్ బారినపడి చికిత్స పొందుతున్నట్లు తెలుస్తోంది.

ఒకరికి వెంటిలేటర్ పై వైద్యం అందిస్తున్నట్లు సమాచారం. ఇలాంటి తరుణంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు పేర్కొంటున్నారు. ఒకపక్క ప్రజలు భయపడాల్సిన పనిలేదని వ్యాధి లక్షణాలు ఉంటే మాత్రం వైద్యులను సంప్రదించాలంటూ పేర్కొంటున్నారు. ప్రస్తుతం రాజమండ్రి సమీప ప్రాంతానికి చెందిన ఇద్దరు కాకినాడ జీజీహెచ్ లో చేరినట్లు తెలుస్తోంది. కాగా వ్యాధివారిలో శరీరమంతా తిమ్మిరిగా అనిపిస్తుందని తీవ్రమైన జ్వరం, వాంతులు వంటి లక్షణలు కనిపిస్తాయని వైద్యులు చెబుతున్నారు. 

Tags:    

Similar News