తూ.గో జిల్లాలో గ్యాస్ లీకేజీ కలకలం.. భయంతో ప్రజలు పరుగులు
ఏపీలో మరోసారి గ్యాస్ లీకేజీ కలకలరేపింది. తూర్పుగోదావరి జిల్లాలో కాకినాడ గ్రామీణ మండలం సర్పవరంలోఅర్ధరాత్రి గ్యాస్ లీకైంది.
ఏపీలో మరోసారి గ్యాస్ లీకేజీ కలకలరేపింది. తూర్పుగోదావరి జిల్లాలో కాకినాడ గ్రామీణ మండలం సర్పవరంలోఅర్ధరాత్రి గ్యాస్ లీకైంది. టెకీ రసాయన పరిశ్రమ నుంచి గ్యాస్ లీకయ్యింది. రసాయన పరిశ్రమ నుంచి గ్యాస్ లీకయ్యిందనే సమాచారం అందగానే స్థానికు పరుగులు తీశారు. సమాచారం అందుకున్న అధికారులు, పోలీసులు అప్రమత్తమయ్యారు. గ్యాస్ లీక్ అదుపులోకి రావడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. తర్వాత స్థానికులు కంపెనీ ముందు ఆందోళనకు దిగారు. అధికారులు స్థానికులలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పారు. గ్యాస్ లీక్‌కు కారణాలపై అధికారులు ఆరా తీస్తున్నారు
విశాఖ ఆర్.ఆర్. వెంకటాపురం సమీపంలోని ఎల్జీ పాలిమర్స్ నుంచి స్టైరిన్ గ్యాస్ లీకేజీ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో 13మంది చనిపోగా.. వందలాదిమంది అస్వస్థతకు గురయ్యారు. మూగజీవాలు సైతం మరణించాయి. పచ్చని చెట్లు కూడా మాడిపోయాయి. ఘటన మిగిల్చిన నష్టం అంతా ఇంతా కాదు. ఇప్పుడిప్పుడే ఆ ఘటన నుంచి గ్రామాలు తెరుకుంటున్నాయి.
HMTV లైవ్ వార్తలు ఎప్పటికప్పుడు గూగుల్ న్యూస్ లో చూడటానికి ఇక్కడ క్లిక్ చేయండి