Garuda Panchami: తిరుమలలో గరుడపంచమి.. తిరువీధుల్లో గరుత్మంతునిపై గరుడ విహారం
Garuda Panchami: భక్తులకు అభయ ప్రదానం చేసిన మలయప్పస్వామి
Garuda Panchami: తిరుమలలో గరుడపంచమి.. తిరువీధుల్లో గరుత్మంతునిపై గరుడ విహారం
Garuda Panchami: గోవిందనామస్మరణ.... మంగళవాద్యారావాలు... మహిళల కోలాటాల నడుమ తిరుమల వీధుల్లో గరుడసేవ వైభవాన్ని సంతరించుకుంది. గరుడపంచమి పర్వదినాన్ని పురస్కరించుకుని తిరుమలలో గరుడ సేవ కన్నుల పండువగా సాగింది. సర్వాలంకర భూషితుడైన మలయప్ప స్వామివారు తన ప్రియ భక్తుడైన గరుడినిపై అధిష్టించి... లోక సంచార సంకేతంగా తిరువీధుల్లో విహరించారు. చతుర్మాడ వీధులలో మలయప్పస్వామి భక్తులకు అభయ ప్రదానం చేశారు.. స్వామివారిని దర్శించుకెనేందుకు అశేష సంఖ్యలో భక్తులు తిరుమలకు తరలివచ్చారు. గరుడసేవ ఆద్యంతం భక్తజనరంగా సాగింది.