AP News: కన్నాతో గంటా శ్రీనివాస్ భేటీ.. వచ్చే ఎన్నికల్లో...
Ganta Srinivasa Rao: వచ్చే ఎన్నికల్లో ఏపీలో టీడీపీ తిరుగులేని విజయం సాధించి చరిత్ర సృష్టిస్తుందన్నారు మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు.
AP News: కన్నాతో గంటా శ్రీనివాస్ భేటీ.. వచ్చే ఎన్నికల్లో...
Ganta Srinivasa Rao: వచ్చే ఎన్నికల్లో ఏపీలో టీడీపీ తిరుగులేని విజయం సాధించి చరిత్ర సృష్టిస్తుందన్నారు మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు. పట్టభద్రుల ఎన్నికల్లో అది రుజువైందని..విశాఖ రాజధాని వద్దని ప్రజలు స్పష్టంగా తీర్పునిచ్చారని గంటా తెలిపారు. అమరావతికి అనుకూలంగా ప్రజలు తీర్పునివ్వడం గొప్ప పరిణామం అన్నారు. వచ్చే ఎన్నికల్లో జగన్ ఘోర పరాజయం పాలు కావడంతో ముమ్మాటికి తథ్యమన్నారు గంటా శ్రీనివాసరావు. గుంటూరులో టీడీపీ నేత కన్నా లక్ష్మీనారాయణను ఆయన నివాసంలో కలిసిన గంటా వారితో టీడీపీ నేతలతో చాలాసేపు చర్చలు జరిపారు. ఇదే సమావేశంలో పాల్గొన్న మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు స్పందిస్తూ...వచ్చే ఎన్నికల్లో వైసీపీ ఓడిపోవడం ఖాయమన్నారు. అందుకే టీడీపీ నేతలపై దాడులకు పాల్పడుతున్నారని ఆరోపించారు.