Gandikota Murder Case: గండికోట మైనర్ బాలిక హత్యకేసులో కీలక మలుపు

Gandikota Murder Case: కడప జిల్లా గండికోట మైనర్ బాలిక హత్య కేసు కీలక మలుపు తిరిగింది.

Update: 2025-10-07 09:01 GMT

Gandikota Murder Case: కడప జిల్లా గండికోట మైనర్ బాలిక హత్య కేసు కీలక మలుపు తిరిగింది. ఈ కేసులో అనుమానితులకు పాలిగ్రాఫ్ టెస్ట్‌కు కోర్టు అంగీకారం తెలిపింది. కేసులో అనుమానితులుగా ఉన్న బాలిక సోదరులు సురేంద్ర, కొండయ్యతో పాటు ప్రియుడు లోకేష్‌ను పాలిగ్రాఫ్ టెస్ట్‌కు విజయవాడకు పోలీసులు తీసుకెళ్లారు.

జులై 14న గండికోటలో ప్రొద్దుటూరుకి చెందిన మైనర్ బాలిక దారుణ హత్యకు గురైంది. బాలిక హత్య కేసులో ఎటువంటి ఆధారాలు లభించకపోవడంతో పాలిగ్రాఫ్ టెస్టుకు అనుమతి ఇవ్వాలని.. జమ్మలమడుగు కోర్టును పోలీసులు ఆశ్రయించారు. ఆగస్టు 26న జమ్మలమడుగు కోర్టులో ముగ్గురు అనుమానితులను పాలిగ్రాఫ్ టెస్టుకు అంగీకారమని కోర్టుకు తెలిపారు.

Tags:    

Similar News