గడప గడపకు వైసీపీ జగన్ ఆశించిన స్థాయిలో సక్సెస్ అవుతోందా?
Gadapa Gadapaku YCP: రాష్ట్రవ్యాప్తంగా నేతలంతా ప్రజల్లో ఉండేలా వైసీపీ బాస్ ప్లాన్...
గడప గడపకు వైసీపీ జగన్ ఆశించిన స్థాయిలో సక్సెస్ అవుతోందా?
Gadapa Gadapaku YCP: ఏపీలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం ఎలా కొనసాగుతోంది? గడప గడపకు వెళ్తున్న ప్రజాప్రతినిధులకు అడుగడుగునా సమస్యలు స్వాగతం పలుకుతున్నాయా? అసలు ఈ కార్యక్రమం ఎలాంటి ఫలితాన్ని ఇచ్చింది? సీఎం జగన్ ఆశించిన స్థాయిలో వర్కవుట్ అవుతుందా? కొన్ని చోట్ల స్వాగతాలు, మరికొన్ని చోట్ల ఎదురుగాలి వీస్తుంది.
వైసీపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావించిన గడప గడపకు ప్రభుత్వానికి బ్రేకులు పడే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. మంత్రుల బస్సు యాత్రతో ప్రజల్లోకి వెళ్లడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. సడెన్ గా ఈ యాత్ర ఫిక్స్ చేయడానికి వెనుక వ్యూహమెంటీ? గడప గడపకు ఆశించిన స్థాయిలో ఫలితాలు రాకపోవడంతోనే మంత్రులు బస్సు యాత్ర చేపట్టారా? మరోవైపు దావోస్ పర్యటన తర్వాత సీఎం జగన్ ప్రజల మధ్య ఉండేందుకు రూట్ మ్యాప్ సిద్ధం చేస్తున్నట్లు తెలస్తోంది.